Friday, April 4, 2025

హైదరాబాద్ లో ‘మిత్సుయి కెమికల్స్’ టెక్నికల్ సెంటర్

జపనీస్ పెట్రో కెమికల్ దిగ్గజం ‘మిత్సుయి కెమికల్స్’ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబర్చింది. ఆ సంస్థ ప్రతినిధి బృందం గ్లోబల్ డెవలప్ మెంట్ జనరల్ మేనేజర్ ఫ్యూజి ఆధ్వర్యంలో గురువారం నాడు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సచివాలయంలో బేటీ అయింది. పెట్రో కెమికల్స్ తో పాటు, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, పారిశ్రామిక పరికరాల రంగాల్లో మిత్సుయి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ను కలిగి ఉంది.

తొలుత టి.హబ్ లో ఒక ఫీజిబులిటీ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆరు నెలల్లో టెక్నికల్ సెంటర్ ను ప్రారంభించనున్నట్టు ఫ్యూజి మంత్రి శ్రీధర్ బాబుకు తెలిపారు. దాని ఏర్పాటుతో తెలంగాణాలో తమ ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు మార్గం ఏర్పడుతుందని వెల్లడించారు. టీ హబ్ ద్వారా లైఫ్ సైన్సెస్, పెట్రో కెమికల్స్ రంగాల్లో ఉన్న అంకుర సంస్థల్లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు మిత్సుయి ప్రతినిధి జి.హన్మంతరావు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com