Sunday, June 15, 2025

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో డెడ్‌బాడీ

ఆలేరు ఎమ్మెల్యే వ్యక్తి గత పనులు చేసే గంధమల్ల రవి (38) ఆత్మహత్య చేస్తున్నాడు. బీర్ల ఐలయ్య సొంత ఇంట్లోని మూడో అంతస్తు టెర్రస్ పైన ఉరేసుకొని చనిపోయాడు. అతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గందమల్ల రవికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. అయితే ఇటీవల రవిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. రెండు రోజులుగా మృతుడి సొంత గ్రామమైన సైదాపురంలోనే ఉన్న అతను.. ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడాలంటే సైదాపురంలోని ఇంట్లో ఉరివేసుకుని ఉండ వచ్చునని గ్రామస్తులు అంటున్నారు. భార్యతో కలిసి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com