Sunday, April 20, 2025

రేవంత్‌రెడ్డి సవాల్‌కు సిద్ధమా?: హరీష్‌రావు

  • రుణమాఫీ  పూర్తయితే ఇంకా దరఖాస్తులెందుకొస్తున్నాయ్‌?
  • గ్రామసభలకు సిఎం రావాలి…నేను కూడా వొస్తా
  • గాడిచర్లపల్లి ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు

రైతులకు పూర్తిగా రుణమాఫీ జరిగితే గ్రామసభలో దరఖాస్తులు ఎందుకొస్తాయనీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రుణమాఫీ పూర్తయిం దంటున్నాడని, గాడిచర్లపల్లి చిన్న గ్రామం. ఇక్కడ రుణమాఫీ కానీ రైతులే ఎక్కువ ఉన్నారనీ, రుణమాఫీపై వాస్తవాలు ఏమిటో తెలుసుకునేందుకు సిఎం రేవంత్‌రెడ్డి గాడిచర్లపల్లికి వొస్తావా..? లేదా సిఎం రేవంత్‌రెడ్డి గ్రామమైన కొండారెడ్డిపల్లికి పోదామా…?అని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిఎం రేవంత్‌రెడ్డిని అడిగారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన గ్రామసభలో భాగంగా బుధవారం సిద్ధిపేట మునిసిపల్‌ ‌పరిధిలోని గాడిచర్లపల్లి(15వ వార్డు) గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. రేవంత్‌ ‌రెడ్డి.. మీ సొంత ఊరికి పోదామ? మా గాడిచర్లపల్లికి వొస్తావా చెప్పు? రుణమాఫీ ఎంతమందికయిందో, ఎంతమంది కాలేదో చూపిస్తానని సవాల్‌ ‌చేశారు. గ్రామానికి చెందిన ఆకుల రాజుకు రూ.1.35 లక్షల రుణం ఉంటే ఇంకా రుణమాఫీ కాలేదు. ప్రజాపాలనను దరఖాస్తు పెట్టుకున్నాడనీ, కుసుంబ నగేష్‌కు లక్ష రూపాయలు వ్యవసాయ రుణముంది.

ఇంకా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడనీ, బాగమ్మగారి పూజకు లక్ష రూపాయల రుణం ఉంది, నర్సింగరావుకు 47 వేల రూపాయలు, ఏల్పుల రాములుకు 42 వేల రూపాయల అప్పు ఉంది..వీళ్లంతా లక్షలోపు రుణం ఉన్నవారే ఇంకా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదనీ గ్రామసభలో దరఖాస్తు పెట్టుకున్నారనీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది రుణమాఫీ కాని వారున్నారన్నారు. మరిగే సుధాకర్‌ 1,90,000 ‌రుణం తీసుకుంటే మిత్తి కడితేనే రుణమాఫీ జరుగుతుందని చెప్పారు అంట. 25వేల రూపాయలు బ్యాంకుకు మిత్తి కట్టాడు. అయినా ఇంకా రుణమాఫీ కాలేదు. సత్తయ్య అనే రైతు దగ్గర 68 వేల రూపాయలు కట్టించుకొని రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేద్నరు. ముఖ్యమంత్రి 2 లక్షల పైనున్న రుణాన్ని కడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాడనీ,  ముఖ్యమంత్రి అబద్ధం చెప్తారని ఎవరూ అనుకోరనీ,  ముఖ్యమంత్రి మాటలువిని 68 వేల రూపాయలు అప్పు తెచ్చి కడితే ఇప్పటివరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదని గ్రామసభలో దరఖాస్తు పెట్టుకున్నాడన్నారు.

ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని దరఖాస్తులు వొచ్చాయనీ, ముఖ్యమంత్రి హైదరాబాదులో ఉండడం కాదు, ఊర్లలో గ్రామసభలోకి రావాలన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి వొస్తే…నేను కూడా గ్రామసభలకు వొస్తానని అన్నారు. పోలీస్‌ ‌పహారాల మధ్య గ్రామసభలు నిర్వహించి మాట్లాడితే అరెస్టు చేస్తున్నారనీ, నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారన్నారు. గత ఏడాది నవంబర్‌ 30‌న  మహబూబ్‌నగర్‌లో 2750కోట్ల రూపాయల  రుణమాఫీ చెక్కు ముఖ్యమంత్రి ఇస్తే ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదనీ, ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ప్రభుత్వ పరువు పోయినట్టే కదా అన్నారు. ముఖ్యమంత్రికి, ఆర్ధిక మంత్రికి రైతుల కోసం ఇచ్చిన చెక్కు రాకపోతే ఇచ్చే బాధ్యత లేదా?ఈ ప్రభుత్వానికి రైతులంటే ప్రేమ లేదు. వారిపై చిత్తశుద్ధి లేదన్నారు. మోసాల పునాదిపై ఏర్పడిరది ఈ ప్రభుత్వం ఏర్పడిరదనీ, రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలనీ,  ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం చెప్పాలని హరీష్‌రావు డిమాండు చేశారు.

నిన్న రాష్ట్రంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ,  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లయినా లేదన్నారు. గాడిచర్లపల్లి గ్రామసభలో రైతులు  వానకాలం రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు అని అడుగుతున్నారన్నారు. రైతుల పక్షాన  బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా నేను కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నా…వానకాలం, యాసంగి కలిపి..ఇచ్చిన మాట ప్రకారం 15000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నామన్నారు. రేవంత్‌ ‌రెడ్డికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే యాసంగి వానకాలానికి కలిపి రైతుబంధు ఇవ్వాలన్నారు. 15వేల కోట్ల రూపాయలతో ఔటర్‌రింగ్‌ ‌వేస్తా అంటున్నావ్‌..5‌వేల కోట్ల రూపాయలతో మీ ఊరికి ఆరుల్కెన్ల్ ‌రోడ్డు వేసుకోవడానికి పైసలుంటాయి, ముసీ సుందరీకరణకు పైసలుంటాయి, ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుకు పైసలు ఉంటాయి కానీ రైతులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవా?అని ప్రశ్నించారు.

ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకోవాలి?
ప్రభుత్వం ఇస్తామని చెప్పిన సంక్షేమ పథకాల కొరకు ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలని ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలనలో, మీ సేవలో అప్లికేషన్లు పెట్టుకున్నారనీ, పెట్టుకున్నప్పుడల్లా ఒక్కొక్కరికి 30నుంచి40రూపాయల వరకు ఖర్చు కావడమే కాకుండా ట్కెం కూడా వృథా అవుతుందన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్‌ల్కెన్‌ ‌చేయకపోవడం, కట్టగట్టి పక్కకు పడేయడం వల్ల మళ్లీ మళ్లీ దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్‌ ‌నాయకుల తప్పులకు అధికారులు బలవుతున్నారనీ, గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నార తెలిపారు.పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే  పెన్షన్లు పెంచిన 4000 రూపాయలు ఇస్తున్నాడన్నారు. రేవంత్‌ ‌రెడ్డి.. అవ్వాతాతలకు 4000 పెన్షన్‌ ఎప్పుడు ఇస్తావ్‌?అని అడిగారు. ఈ గ్రామ సభలో మునిసిపల్‌ ‌ఛ్కెర్‌పర్సన్‌ ‌కడవేర్గు మంజుల%-%రాజనర్సు, కమిషనర్‌ అ‌శ్రిత్‌కుమార్‌, ‌స్థానిక వార్డు కౌన్సిలర్‌ ‌పాతూరి సులోచన, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com