Sunday, March 16, 2025

డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదన్న కారణంతో 163 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: మాజీ మంత్రి హరీష్ రావు

మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ సర్వే చేయిస్తుంటే, తెలంగాణలో ఏఈవోలపై అదనపు భారాన్ని రుద్దుతూ వేధింపులకు గురిచేయడం దుర్మార్గం.

రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ, సాగు పెంపుదల లక్ష్యంలో భాగంగా 1500 కొత్త ఏఈవోల పోస్టులను సృష్టించారు.

దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ విజయగాథలో ఏఈవోల పాత్ర ఎంతో ఉంది.

అలాంటి వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం శోచనీయం.

ఉద్యోగులపై బలవంతంగా భారం వేయడం, మాట వినలేదని సస్పెండ్ చేయడమేనా మీ ప్రజాపాలన.

సస్పెండ్ చేసిన 163 ఏఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, డిజిటల్ సర్వే ఏఈవోలకు భారం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com