Monday, April 21, 2025

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి

హుజూరాబాద్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గ్రామస్తులు టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హన్మకొండ మండలం కమలాపూర్ లో శుక్రవారం జరిగింది. అయితే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు మాత్రం పోలీసులను సైతం ఎదురించారు. కమలాపూర్ లో ప్రభుత్వ పథకాలకు అర్హుల జాబితాను ప్రకటించేందుకు, అలాగే అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణకు గ్రామసభను శుక్రవారం ప్రారంభించారు. అలా గ్రామసభ ప్రారంభం కావడంతోటే, హుజూరాబాద్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి సభకు వచ్చారు. అధికారులు లబ్దిదారుల జాబితాలో ఏ మాత్రం అనుమానం ఉన్నా, తమను సంప్రదించాలని కోరారు. అంతేకాకుండ అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించింది అంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీనితో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు అసహనానికి గురయ్యారు. అంతలోనే గ్రామసభకు వచ్చిన కొందరు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై టమాటాలు విసిరారు. ఆ వెంటనే తేరుకున్న కౌశిక్ రెడ్డి అనుచరులు, ఏకంగా కుర్చీలను చేతబట్టి కాంగ్రెస్ శ్రేణులపై దాడికి యత్నించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com