Monday, September 30, 2024

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి భార్య ఆత్మహత్య

చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్ లోని తన సొంత నివాసంలో రాత్రి 10:30 సమయంలో ఉరి వేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన కొంపల్లిలోని రెనోవ హాస్పిటల్ కు తరలించారు.

వారికి 10 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల పాప ఉన్నారు. గతవారం తిరుపతి, కంచి, కాణిపాకం తోపాటు పలు పుణ్యక్షేత్రాలను ఐదు రోజులపాటు సందర్శించి వచ్చారు. ఇంతలోనే ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. 2010 బ్యాచ్ కి చెందిన రూపాదేవి మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండల్ రావల్కోల్ గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

మేడిపల్లి సత్యం రూపాదేవి 2012 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Actress Kriti Sanon New Stills

Mrunal Thakur Latest Pics

Actress Shriya Saran new pics