Sunday, April 20, 2025

కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు

తెలంగాణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎంపిక కాబోతున్నాయి. త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తులు ఓ కొలిక్కి వచ్చినట్టు తాజా సమాచారం. ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులతో కాంగ్రెస్ అధిష్ఠానం జాబితా విడుదల చేసింది. ఇందులో నటి, మాజీ ఎంపీ విజయశాంతి పేరు కూడా ఉంది. విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేర్కొంది. కాగా, ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ కు దక్కనుండగా… నాలుగు కాంగ్రెస్ కు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో, ముగ్గురితో జాబితా ప్రకటించిన ఏఐసీసీ… నాలుగో స్థానాన్ని మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com