Thursday, December 26, 2024

Kaushik Reddy vs Pranav: కౌశిక్ రెడ్డి వర్సెస్ ప్రణవ్

హుజురాబాద్ నియోజకవర్గం లో హై టెన్షన్

హుజురాబాద్ మండలంలోని చెలుపూర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ చాలెంజ్ చేసుకుని వేదిక చేసుకున్న చెల్పూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద 144 సెక్షన్ పోలీసులు అమలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు పార్టీల నాయకులను హౌస్ అరెస్టు చేయడం జరిగిందని, కార్యకర్తలు ఎవరు చేల్పూర్ హనుమాన్ దేవాలయం వద్దకు రావద్దని హుజురాబాద్ ఏసీబీ శ్రీనివాస్ అన్నారు.

చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిన కేసులు పెట్టడం జరుగుతుందని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ తడి బట్టలకు స్నానం చేసి కుటుంబ సమేతంగా జాబు ఇస్తానని 20 లక్షల రూపాయలు పాడి కౌశిక్ రెడ్డి తీసుకున్నాడని ప్రమాణం చేశారు. హుజురాబాద్, జమ్మికుంట నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేల్పూర్ ఆంజనేయస్వామి టెంపుల్ వద్దకు వెళ్లకుండా పోలీస్ అరెస్టులు చేయడం జరిగింది.

MLA Paddy Kaushik Reddy ఎమ్మెల్యే పాడీ కౌశిక్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు అవినీతిని నిరూపించమని సవాల్ విసురుతారు. మళ్లీ వారే పోలీసులను పంపి అరెస్టు చేయించుతారు. ఇదేనా కాంగ్రెస్ నేతల తీరు? ప్రభుత్వం మీదే కదా, పోలీస్ యంత్రాంగం మీ కను సన్నల్లోని నడుస్తుంది కదా, ఇప్పటికైనా నా సవాల్ కు సిద్ధం కండి నేను ఒక్కడినే వస్తాను కార్యకర్తలు కూడా నా వంట రారు. నన్ను విడిచిపెట్టండి, నేను సెల్పులు హనుమాన్ దేవాలయం వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాను మీ పోలీసులకు చెప్పండి దమ్ముంటే నన్ను అనుమతించండి.

అయినా ఈరోజు దేవుడు సాక్షిగా మీరు చేసిన సవాలుకు నా నిజాయితీ నిరూపించుకునేందుకు నేను తడి బట్టలతో ప్రమాణం చేస్తున్న, నేను ఎక్కడ కూడా ఒక అవినీతి చేయలేదు. చేసే అవసరం నాకు లేదు చెయ్యను. మంత్రి పొన్నం ప్రభాకర్ ను నేను సవాల్ చేస్తున్నా రేపు 12 గంటలకు నువ్వు అపోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చి నా సవాల్ ని స్వీకరించి నీ నిజాయితీ నిరూపించుకో ఒకవేళ నువ్వు రాకపోతే నువ్వు అన్ని స్కామ్లు చేసినట్లే అక్రమంగా నువ్వు వేల కోట్ల రూపాయలు దోచుకున్నావని ఒప్పుకున్నట్లే అని తెలిపారు.

హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రాణవ్ తన నివాసంలో విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ ఆధారాలు లేకుండా నేటి నుండి మంత్రిపై ఆరోపణలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తప్పుడు ఆరోపణలు పట్ల సాక్షాలు ఏవి, ఉద్యోగాల కోసం కౌశిక్ రెడ్డి డబ్బులు తీసుకున్న రని సెల్పూర్ లో తడి బట్టలతో కొబ్బరికాయ కొట్టి ప్రమాణం చేశారు. ఆధారాలు ప్రెస్ ముందు పెట్టాను. కౌశిక్ రెడ్డి నువ్వు చేసిన ఆరోపణల పట్ల సాక్ష్యాలు ఏవి. ఓవర్ లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పటినుండి మా ప్రభుత్వానికి సాహేతుకమైన సూచనలు ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యేగా ఆరు నెలల్లో ఒక మంచి పని చేశారా, దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు ఆడడం సిగ్గుచేటు అని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com