Friday, March 14, 2025

బీజేపీ నుంచి పాత సామాను బయటికి వెళ్లిపోవాలి

కొందరు నాయకులతో పార్టీకి భారీగా నష్టం
ఎంపీలు, ఎమ్మెల్సీ తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ

పార్టీలో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖను రిలీజ్‌ చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వొస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి మీటింగ్ లు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వొస్తుందని ప్రశ్నించారు. కేంద్ర అధికారులు గమనించాలన్నారు. తెలంగాణ హిందూ సేఫ్‌గా ఉండాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ గవర్నమెంట్‌ రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలన్నారు.

కేంద్ర అధికారులు దీనిపై ఆలోచన చేయాలని కోరారు. ఇది నా పార్టీ.. నా అయ్య పార్టీ అనేవాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నారన్నారు. వాళ్లని రిటైర్‌ చేస్తేనే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వొస్తాయన్నారు. ఇది తాను కాదు ప్రతి ఒక్క బీజేపీ సీనియర్‌ అధికారులు, కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని లేఖలో రాజాసింగ్‌ పేర్కొన్నారు.   గతంలో కూడా బీజేపీని ఒకే సామాజిక వర్గానికి వ్యక్తులు శాసిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉందంటూ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.

బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్‌ రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అప్పట్లోనే రాజాసింగ్‌ లేఖ రాశారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని నెలరోజుల క్రితం రాజాసింగ్‌ విడుదల చేసి లేఖ కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు కొనసాగిస్తుండగా కొంతమంది బీజేపీ పార్టీ నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రహస్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమవుతున్నారని, ఇది బీజేపీకి మంచిది కాదన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మొదటి నుంచి పేరుకుపోయిన చాలా మంది నేతలను పార్టీ నుంచి బయటకు పంపించి వేయాలని, వాళ్లని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. దాంతో పాటుగా పార్టీని తమ అయ్య జాగీరుగా భావిస్తున్న వారు బీజేపీలో చాలా మంది ఉన్నారని, వారంతో కొన్ని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అంటూ ఆరోపణలు చేస్తూ లేఖను రిలీజ్‌ చేశారు రాజాసింగ్‌. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నవారి వివరాలు తనకు తెలుసని.. వారిపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు లేఖలో పేర్కొన్నా రాజాసింగ్‌. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com