Saturday, May 10, 2025

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

తెలుగు ప్రజలందరికీ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని కోరుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయని ఎమ్మెల్యే సుజనా విచారం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే కూటమి నేతల సహకారంతో, బాధితులకు అండగా నిలబడుతున్నామన్నారు.

ప్రస్తుతానికి పండగ వాతావరణం లేదని అందరికీ త్వరిత గతిన సహాయ సహకారాలు అందించడమే ధ్యేయమన్నారు. విజయవాడలోని పశ్చిమ, సెంట్రల్ , నియోజకవర్గాలు తీవ్రంగా నష్టపోయాయని వారందరి బాధలు తీర్చేందుకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సభ్యులు , వాలంటీర్లు, కూటమి నాయకులు, అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. నియోజవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా స్వయంగా పరిష్కరిస్తానని భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com