కొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే..
•పత్తి కొనుగోళ్ల గోల్‌మాల్‌పై ఎంక్వయిరీ జరపాలి
•ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు డిమాండ్
అందాల పోటీల(మిస్ వరల్డ్)మీద ఉన్న శ్రద్ధ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అవస్థలపై లేకుండా పోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. సోమవారం సిద్ధిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేననీ, ఈ మరణాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యు లన్నా రు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ధాన్యం కొనలే దనీ, రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తూ రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారన్నారు.
ధాన్యం కుప్పలపైన ప్రాణాలు కోల్పోతున్నారని, గత ఏప్రిల్ 15న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో జలపతిరెడ్డి అనే రైతు మృతి చెం దాడని తెలి పారు. ఏప్రిల్ 21న మహబూ బాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం కొనుగోలు కేంద్రంలో హనుమండ్ల ప్రేమలత అనే మహిళా రైతు హఠాన్మరణం చెందారని, ఏప్రిల్ 22న నెల్లికుదురు మండలం మదన తుర్తి కొనుగోలు కేంద్రంలో బిర్రు వెంకన్న ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఏప్రిల్ 26న సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూ రులో కొనుగోలు కేంద్రంలో చింత కింది హన్మయ్య ధాన్యం నేర్పుతూ కుప్పకూలి ప్రాణాలు వొదిలాడన్నారు.. ఇవీ సహజ మరణాలు కావు, ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవే అని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు ప్రాణాలు కోల్పోతుంటే ఏం ముఖం పెట్టుకొని వేడుకలు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ద, అన్నదాతల ఆవేదనపై లేకపోవడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పినందుకో, ఇంకెందుకో తెలియదు గానీ ప్రకృతి పగ పట్టినట్టుందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రతి రైతుకూ మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రహసనంగా మారిందన్నారు. ధాన్యం అమ్మి 10రోజులు దాటుతున్నా డబ్బులు రైతులకు చెల్లించడం లేదన్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. కొన్న పంట డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలనీ, పెండిరగ్‌లో ఉన్న 500 కోట్లరూపాయలకుపైగా పంట బోనస్‌ను తక్షణం విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుల తరబడి మార్కెట్ యార్డుల వద్ద రైతులు వేచి చూస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మార్కెట్లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో, ధాన్యం నీటిపాల్కెందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో, సివిల్ సప్లయ్ అధికారిపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్‌తో హరీష్‌రావు ఫోన్లో మాట్లాడి లారీలను, హమాలీలను వెంటనే సమకూర్చి ధాన్యాన్ని సేకరించాలని ఆదేశించారు. అలాగే, లారీ అసోసియేషన్‌తో మాట్లాడి ధాన్యం సేకరణకు లారీలను పంపించాల్సిందిగా హరీష్‌రావు కోరారు. ఆయన వెంట ఏఎంసి మాజీ ఛ్కెర్మన్ పాల సాయిరాం, మునిసిపల్ మాజీ ఛ్కెర్మన్ రాజనర్సు, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గుండు భూపేష్, నల్లా నరేందర్‌రెడ్డి, గుడాల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.