ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం :వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత పర్యటన.నడుం లోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే.వరద బీభత్సం వర్ణనాతీతంగా మారింది.అకాల వర్షాలతో వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి.ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి.నడుం లోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను, మహాకూటమి నాయకులను ఆదేశించారు.కొనసాగుతున్నాప్రతి ఇంటికి మినిరల్ వాటర్ పంపిణీ చేయాలని ఆదేశించారు.మైలవరం నియోజకవర్గంలో వరద బీభత్స నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.వరద బీభత్సం తగు ముఖం పట్టే వరకు సహాయ చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.ఊహించని విధంగా ఎదురయ్యే ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు.ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వరద బాధితులకు విస్తృతంగా సేవలను అందించాలన్నారు…