Friday, November 8, 2024

ఎమ్మెల్యే కు బెదిరింపులు

20 లక్షల డిమాండ్ లేకుంటే పిల్లలు అనాధలవుతారు

లండన్ నుండి కాల్, గుర్తించిన పోలీసులు, లుక్ అవుట్ నోటీస్ జారీ

కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ

కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కే బెదిరింపు కాల్స్ రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. గత సెప్టెంబర్ 28వ తేదీన +447886696497 నుండి వాట్సాప్ ఫోన్ కాల్ వచ్చినట్లు ఎమ్మెల్యే పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో నిందితుడు మాట్లాడుతూ తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని లేనియెడల రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి, గౌరవానికి భంగం కలిగే చర్యలకు పాల్పడతానని బెదిరించినట్లు తెలిపారు. మా డిమాండ్ ఒప్పుకోకుంటే ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) గా గుర్తించారు. ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నట్లు, అక్కడి నుండే బెదిరింపులకు పాల్పడినట్లు, నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular