Sunday, December 29, 2024

బావమరిది తప్పు చేస్తే కెటిఆర్ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు

  • బావమరిదిని వెనుకేసుకొస్తే కెటిఆర్ రాజకీయ భవిష్యత్‌కు సమాధి తప్పదు
  • సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో సెర్చ్ వారెంట్ ఇవ్వలేదని కెటిఆర్ అనడం ఆయన తెలివి తక్కువతనం అని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీ చేసే హక్కు అధికారులకు ఉంటుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాజ్ పాకాల లేకుండా ఆయన ఇంట్లో పార్టీ అంటే నవ్వొస్తుందన్నారు. సోమవారం సిఎల్పీ కార్యాలయంలో యెన్నం మీడియాతో మాట్లాడుతూ రాజ్ పాకాల చరిత్ర తమకు తెలియనిదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి డ్రగ్స్ వినియోగించినట్లు తేలిందని తనను కూడా పరీక్షిస్తే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతానని భయంతోనే రాజ్ పాకాల తప్పించుకొని పారిపోయారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటన జరగ్గానే రాజ్ పాకాల మీడియా ముందుకు వచ్చి అక్కడ ఏం జరిగింతో చెబితే ఇవాళ కెటిఆర్ చెబుతున్న మాటలకు కనీసం అర్థం ఉండేదన్నారు. బావమరిది తప్పు చేస్తే కెటిఆర్ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయవద్దన్నారు. బావమరిదిని వెనుకేసుకొస్తే ఎంతో భవిష్యత్ ఉన్న మీకు రాజకీయ భవిష్యత్‌కు సమాధి తప్పదని ఆయన హెచ్చరించారు.

జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు అనుమతులు ఇప్పించిందే రాజ్ పాకాల
జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు అనుమతులు ఇప్పించిందే రాజ్ పాకాల అని ఆయన అన్నారు. అధికారులు దర్యాప్తు చేయడం తప్పా? ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారుల ప్రమేయం ఎక్కడ ఉందని యెన్నం ప్రశ్నించారు. జన్వాడ ఫాం హౌస్‌లో స్ట్రింగ్ ఆపరేషన్ జరగలేదని ఫిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. రాజ్ పాకాల ఇస్తేనే తాను డ్రగ్స్ తీసుకున్నానని విజయ్ మద్దూరు చెప్పారని, ఇది చాలా సీరియస్ విషయమని ఆయన అన్నారు.

ఇది అబద్ధం అయితే వెంటనే రాజ్ పాకాల పోలీసులకు లొంగిపోవాలని లేకుంటే ఇది నిజం అని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి ఉంటుందన్నారు. ఏం జరిగిందో వివరంగా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత కెటిఆర్‌పై ఉందన్నారు. ఎదురు దాడి అన్నింటిలో పనికి రాదని కెటిఆర్ గుర్తించాలని ఆయన హితవు పలికారు. సమాజం కోసం నిజాయితీగా ఉండాల న్నారు. పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబులు ఇవి కావని ఇవి వారి సెల్ఫ్ గోల్ మాత్రమేనని ఆయన అన్నారు. పొలిటికల్ బాంబు అంటే కాళేశ్వరం, ఎలక్ట్రిసిటీ, భూదాన్, ఈడీ, హవాలా బాంబులు ఉంటాయన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com