Wednesday, November 6, 2024

మేము డ్రగ్స్ టెస్టులను చేసుకున్నాం… మీరు టెస్టులు చేయించుకోండి

  • టెస్టుల కోసం ఆస్పత్రికి కౌశిక్ ఎందుకు రాలేదు
  • కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా
  • ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి సవాల్ విసిరిన
  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్

కెటిఆర్‌కు నిజంగా డ్రగ్స్ తీసుకోవడం అలవాటు లేకపోతే డ్రగ్స్ శాంపిల్ టెస్ట్ చేయించుకోవాలని, కెటిఆర్ డ్రగ్స్ తీసుకుంటారా లేదా అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్‌లు డిమాండ్ చేశారు. తాము అపోలో ఆస్పత్రికి వెళ్లి శాంపిల్స్ ఇచ్చామని, మీరు కూడా శాంపిల్స్ ఇచ్చి రిపోర్ట్ జనాల ముందు బయట పెట్టాలని వారిద్దరూ పేర్కొన్నారు. కౌశిక్ నోరు అదుపులో పెట్టుకో లేదంటే బయట తిరిగే పరిస్థితి ఉండదని వారు హెచ్చరించారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి వస్తానని చెప్పిన కౌశిక్ తోకముడిచారని వారు ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ పాలన, గత పది నెలల కాంగ్రెస్ పాలనపై చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని ఈ చర్చకు పాడి కౌశిక్ రెడ్డి సిద్ధమా అని వారు సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని ఫాంహౌస్‌కు వెళ్లి దొరనే కలుస్తారో లేక ఆ పార్టీలో మరెవరివద్దకైనా వెళతారో ఆయన ఇష్టమన్నారు.

అసలు నీ చరిత్ర, నీ బండారం ఏమిటో బయటపెడతామన్నారు. జన్వాడ ఫాంహౌస్ డ్రగ్స్ వ్యవహారం కౌశిక్ రెడ్డికి సంబంధించినది కాదని, ఇది కెటిఆర్‌కు సంబంధించిదన్నారు. ఈ వ్యవహారంలో కెటిఆర్ సన్నిహితులు ఉన్నారని అందువల్ల కెటిఆర్ రాజ్ పాకాల డ్రగ్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కెసిఆర్, కెటిఆర్ మెప్పు పొందేందుకు మాట్లాడితే సొంత పార్టీ నేతలే నిన్ను తిట్టే పరిస్థితి వస్తుందన్నారు. రాజకీయం కోసం కౌశిక్ రెడ్డి ఎంతటి నీచానికైనా దిగజారే వ్యక్తి అని వారు ధ్వజమెత్తారు. ఓట్ల కోసం భార్యను బిడ్డను బయటకు తీసుకొచ్చిన చరిత్ర నీదన్నారు.

గత పదేళ్లుగా కెసిఆర్ వారి కుటుంబ సభ్యులు, వారి దగ్గరి మిత్రులు డ్రగ్స్ తీసుకుంటారన్న అనుమానాలు ఉన్నాయని అందువల్ల కెటిఆర్‌కు ఆ అలవాటు ఉందని అనేక మంది అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు. కానీ, ప్రతిసారి కెటిఆర్ ఈ విషయాన్ని బుకాయిస్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. మరోక్కసారి ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తే బాగుండదని వారు కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వైఎస్సార్ సిపితో మొదలైందని, రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని వారు పేర్కొన్నారు. ఈరోజు బిఆర్‌ఎస్‌లో వచ్చి చేరారు, రేపు ఎక్కడ ఉంటారో తెలియదని, ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే బిఆర్‌ఎస్ పార్టీ పరిస్థితికి మంచిది కాదని వారు హితవు పలికారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular