Tuesday, May 13, 2025

కారు దిగిన ఎమ్మెల్సీ చల్లా

సిఎం రేవంత్‌రెడ్డితో భేటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌ ‌బై చెప్పేశారు. అలాగే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి ’కారు’ దిగేశారు. దీంతో పార్టీ నుంచి వెళ్లిపోయేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. అటు కాంగ్రెస్‌లో చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్‌ను వీడటానికి సిద్ధమయ్యారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి కాంగ్రెస్‌ ‌తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డితో ఎమ్మెల్సీ చల్లా భేటీ అయ్యారు. అలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగు నీరు అందించే నె•-టటెంపాడు, ఆర్డీఎస్‌ ‌ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎంను ఎమ్మెల్సీ కోరారు. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్‌లొ చల్లా చేరే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం తో ఏవి• చేయలేని స్థితిలో గులాబీ పార్టీ ఉండిపోయింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com