Friday, January 10, 2025

ఒక్కో సినిమాకు ఒక్కో తీరా..?

సీఎం రేవంత్‌ రెడ్డిది రెండు నాల్కల ధోరణి
గేమ్ చేంజర్‌కు ఎందుకు అదనపు షోలు
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వ‌జం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్‌ రేట్ల పెంపు ఎందుకు..? అని దేశపతి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో తో రేవంత్‌ రెడ్డిది రెండు నాల్కల ధోరణి అని అర్థమైపోయింది. టికెట్ల పెంపుదల ఉండదని అసెంబ్లీ సాక్షిగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? ఈ జీఓపై వివరణ ఇవ్వాలి. గేమ్ చేంజర్‌ సినిమా వొచ్చేసరికి రేట్ల పెంపుదలకు అవకాశమిచ్చారు.

ఆయనకు ప్రత్యేకమైన ప్రివిలేజ్‌ ఎందుకు..? ఇక నుంచి బెనిఫిట్‌ షోలు, అదనపు షోలు ఉండవని సీఎం నెల రోజుల క్రితం అసెంబ్లీలో ప్రకటించారు. మరి గేమ్ చేంజర్‌కు ఎందుకు ప్రివిలేజ్‌ ఇస్తున్నారు అని దేశపతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. నిజానికి దిల్‌ రాజు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ కలిసి రాలేదు. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణకు అండగా నిలబడలేదు. సంక్రాంతికి వొస్తున్నాం ఫంక్షన్‌లో తెలంగాణ కల్చర్‌ను దిల్‌ రాజు అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలోనే సినిమాలకు వైబ్‌ ఉంటుందట. తెలంగాణలో వైబ్‌ ఉండదట.

అయితే తెలంగాణలో సినిమాలు మానుకో దిల్‌ రాజు. కల్లు, మాంసం దుకాణాలు పెట్టుకో.. ఇక్కడ వైబ్‌ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్‌ కదా. ఇక్కడి సినిమాలకు వైబ్‌ ఉండదని అంటున్నవ్‌ కదా.. అని దేశపతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. సినిమా టికెట్‌ రేట్లు పెంచమన్న రేవంత్‌ రెడ్డి పూటకోమాట మార్చుతున్నాడు. సినిమాటోగ్రఫి శాఖ మంత్రి టికెట్‌ రేట్ల పెంపుదల ఉండదని ప్రకటించారు. మరి దీనిపై సమాధానం చెప్పాలి. సినిమాలు విడుదలైతే టికెట్‌ రేట్లు పెంచి పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దన్నాడు రేవంత్‌ రెడ్డి. మరి గేమ్ చేంజర్‌కు ఎందుకు పెంచాల్సిన అవసరమొచ్చింది. నిజాయితీ లేని ముఖ్యమంత్రి, మంత్రలు ఉండటం దురదృష్టకరమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com