ప్లెక్షి తొలగింపుఫై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్లెక్షి తొలగింపుఫై ఎమ్మెల్సి టి. జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల నుంచి నన్ను వెల్లగొడతార ఏంటి అని జీవన రెడ్డి అధికారులు తీరుఫై అసహనానికి గురయ్యారు. జగిత్యాల పట్టణంలోని 8వ వార్డు బుడుగ జంగాల కాలనీలో గురువారం బోనాల పండగ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సి టి. జీవన్ రెడ్డి ఫోటోతో కరీంనగర్ రోడ్డులో కాలని ప్రారంభంలో ప్లెక్షి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాలనీలోపలికి వెళ్ళి వచ్చే సరికి మున్సిపల్ అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్షిని తొలగించి వేశారు.
అటునుంచి తిరిగి వెళ్తున్న ఎమ్మెల్సి జీవన్ రెడ్డి దృష్టికి స్థానికులు తిసుకేల్లగా అక్కడే ఉన్న మున్సిపల్ సిబ్బందిని ఎవరు తియమన్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించగా టౌన్ ప్లానింగ్ అధికారిని తేజస్విని తొలగించామన్నారని తెలపడంతో కమిషనర్ కు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు.
కనీసం ఒక గంట కూడా ఉంచకుండా ఎలా తొలగిస్తారు .నిబంధనలు అందరకి ఒకేలాగా ఉండవా .. నిబంధనలు ఎలా ఉంటె అలా చేయండని ఒక గంటకే తొలగించడం ఏంటని ప్రశ్నించారు. నన్ను జగిత్యాల నుంచి వెల్లగోడతార ఏంటి అని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం ఫై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.