Sunday, May 4, 2025

ఎంఎల్‌సి కవితతో కెటిఆర్, హరీశ్‌రావు ములాఖాత్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ సీనియర్ నాయకులు హరీశ్‌రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా వారు కవితతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు. న్యాయవ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎంఎల్‌సి కవిత బెయిల్ అభ్యర్థన హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో…సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్‌పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కెటిఆర్, హరీశ్‌రావులు చర్చిస్తున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ వేసే వరకు ఇరువురు ఢిల్లీలోనే ఉండి… న్యాయవాదుల బృందంతో సమన్వయం చేయనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com