Friday, April 4, 2025

మళ్లీ నిరాశే… కవితకు లభించని ఊరట

మరో రెండు వారాలు కస్టడీ పొడిగింపు

సీబీఐ ప్రత్యేక కోర్టులో బీఆర్ఎస్ ఎంఎల్‌సి కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె జ్యూడిషియల్ కస్టడీ పొడిగించారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే విషయంపై జులై 3న కోర్టు విచారణ జరపనుంది. ఈడీ నమోదు చేసిన కేసులో జులై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిపై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హై‌కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టులో అధికారులు హాజరుపరుచగా.. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జులై 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పును వెలువరించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com