Sunday, April 20, 2025

కేటీఆర్‌కు రాఖీ కట్టి ఎమోషనల్ అయిన కవిత..

దాదాపు 5 నెలలకుపైగా జైలు జీవిత గడిపిన అనంతరం విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తల్లి శోభను కౌగిలించుకుని కవిత ఎమోషనల్ అయ్యారు. అనంతరం అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆనందంతో కవితను కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టు మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది న్యాయస్థానం. ఒక్కో కేసులో రూ.10 లక్షల విలువైన షూరిటి సమర్పించాలని ఆదేశించింది. అలాగే, పాస్ పోర్టు అధికారులకు అప్పగించాలని.. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని సూచించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com