Saturday, May 10, 2025

కవిత కస్టడీ పొడగింపు

  • కవిత కస్టడీ పొడగింపు
  • ఈడీ చార్జ్​షీట్​ను పరిగణలోకి తీసుకున్న కోర్టు
  • 20 తర్వాత విచారిస్తామంటూ వెల్లడి
  • అప్పటిదాకా జ్యుడిషియల్​ కస్టడీలో కవిత

ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ (ఈడీ) కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు కవితను హాజరుపర్చారు. మే 7న కోర్టు విధించిన జ్యూడీషియల్ కస్టడీ సమయం ముగియడంతో కోర్టులో కవితను ఈడీ హాజరుపర్చింది. ఇప్పటికే కవిత అరెస్ట్ పై ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. మంగళవారం కవిత జ్యూడీషియల్ కస్టడీ పొడగింపు విచారణ సందర్భంగా.. కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకొవాలని కోర్టును ఈడీ కోరింది. ఈడీ చార్జ్​షీట్​ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఈ నెల 20 వరకు కస్టడిని పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి రెండు నెలలు పూర్తయింది.

అయితే, 46 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ (మహిళా ఖైదీలు) కాంప్లెక్స్ లో కవిత ఉంటున్నారు. మే10వ తేదీన కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఛార్జ్ షీటును ఈడీ దాఖలు చేసింది. ప్రీవెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్స్ ను కోర్టులో ఈడీ ఫైల్ చేసింది. కవితను అరెస్ట్ చేసిన 60రోజుల టైంలోపు చార్జ్ షీటు దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద 224 పేజీలతో చార్జిషీట్ ఈడీ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత, ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్లను తాజా ఛార్జీషీటులో నిందితులుగా ఈడీ పేర్కొంది. జ్యూడీషియల్ కస్టడీ సమయం ముగియడంతో మే7న కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే.

లిక్కర్ స్కాంలో కవితను కింగ్ పిన్ గా పేర్కొంటున్న ఈడీ.. ఆప్ కి రూ. 100కోట్లు ముడుపులు అందించడంలో కవిత కీలక పాత్ర పోషించారని కోర్టు దృష్టికి ఈడీ తీసుకెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ.. 8 పేజీల చార్జ్​షీట్​ను మళ్లీ దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ చార్జ్​షీట్​ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 20న విచారణ చేస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో 20 వరకు జ్యుడిషియల్​ కస్టడీలో కవిత ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే సీబీఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com