Saturday, May 24, 2025

MLC Kavitha Case: కవిత కేసు

  • ఎమ్మెల్యేల కొనుగోలు
  • రెండింటికీ లింక్ పెట్టిన ఫోన్ ట్యాపింగ్
  • రాధాకిషన్రావు వాంగ్మూలంలో సంచలనాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కు కవిత కేసుకు లింక్ ఉన్నట్లు రాధాకిషన్​ రావు వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో బీజేపీని ఓడించాలని కేసీఆర్ టార్గెట్గా పెట్టుకున్నారు. అదే టైమ్లో పైలెట్ రోహిత్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అగ్రనేతలను సంప్రదించారు. బీజేపీకి చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పారు. ఎస్ఐబీ చీఫ్‌ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు విషయం నాతో చర్చించారు. బీజేపీ అగ్రనేతల ఫోన్‌లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్‌ చేసింది. ట్యాప్‌ చేసిన ఒక ఆడియో టేప్‌ను కేసీఆర్కు పంపించింది. ఆ తర్వాతే కేసీఆర్‌ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించారు. టాస్క్ఫోర్స్ టీమ్ను ఢిల్లీకి పంపించి స్పై కెమెరాలు తెప్పించారు.

MLAs purchase case in telangana

ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే ఫామ్‌హౌస్‌లో కెమెరాలను అమర్చారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ నేతలతో చర్చలు జరుపుదామని పెద్దాయన అనుకున్నారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్‌ను అరెస్ట్‌ చేయలేకపోయాం. ఒక టీమ్ను కేరళకు పంపించినప్పటికీ ప్లాన్ ఫెయిలైంది. సంతోష్‌ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేను…’ అని ప్రస్తావించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తవ్వేకొద్దీ మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి చెక్‌పెట్టేందుకు అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రణాళిక, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆపరేషన్‌కు సంబంధించి ఆయన వ్యూహాలను మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. బీఎల్​ సంతోష్‌ను అరెస్టు చేయాలని చూసినా కొందరు అధికారుల వైఫల్యంతోనే అది సాధ్యపడలేదని తెలిపారు. రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్టు తెలిసింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరినపుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్​ భావించారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో తెలిపారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్​ ఉన్నట్టు రాధాకిషన్‌రావు తెలిపారు. ఈ సమయంలోనే పైలెట్ రోహిత్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలను సంప్రదించినట్టు తెలిసింది. బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలైన్స్ పెట్టాలని కేసీఆర్​, ఎస్​ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం Farmer SIB chief Prabhakar Rao MLAs purchase

Farmer SIB chief Prabhakar Rao MLAs purchase
అప్పటి ఎస్​ఐబీ చీఫ్‌ ప్రభాకర్​ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని, బీజేపీ అగ్రనేతల ఫోన్‌లను ప్రణీత్‌రావు బృందం ట్యాప్‌ చేసినట్టు రాధాకిషన్‌రావు చెప్పారు. అలా ట్యాప్‌ చేసిన ఒక ఆడియో టేప్‌ను కేసీఆర్​కు పంపినట్టు వెల్లడించారు. ఆ తర్వాతే కేసీఆర్‌ అందరినీ ట్రాప్‌ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్‌ఫోర్స్ టీంను దిల్లీ పంపామని, ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్‌హౌస్‌లో అమర్చామని తెలిపారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్‌ రావు తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి బీజేపీ అగ్రనేత బీఎల్​ సంతోష్‌ను అరెస్టు చేయాలని కేసీఆర్​ ఆదేశించినట్టు చెప్పారు.

బీఎల్​ సంతోష్‌ను అరెస్టు చేస్తే దిల్లీ మద్యం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వివరించారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థతవల్లే సంతోష్‌ను అరెస్ట్‌ చేయలేకపోయామని తెలిపారు. పలువురు అధికారులను కేరళకు పంపించినా ప్రణాళికను విజయవంతం చేయలేదన్నారు. సంతోష్‌ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్​ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్‌రావు వివరించారు. కేసీఆర్​తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది.

Phone tapping case, mlc kavitha scam, mla’s purchase, radhakishan rao case

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com