Wednesday, June 26, 2024

సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పలు రైళ్లు రద్దు….దారి మళ్లీంపు

దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కాజీపేట- టు సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో వాటిని నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మరికొన్ని రైళ్లను దారి మళ్ల్లీంచారు. సాంకేతిక సమస్యల వివరాలు ప్రకటించనప్పటికీ, సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

బాలాసోర్ వద్ద కోరమాండల్ విపత్తును దృష్టిలో ఉంచుకుని, అధికారులు దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరి స్తున్నారు. 12757/58 కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 23 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు రెండు వైపులా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 12967 చెన్నై టు -జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 25, 30, జూలై 2,7 తేదీల్లో రద్దు చేయగా, 12968 జైపూర్ టు -చెన్నై జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21,23,28,30, జూలై 5వ తేదీన రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

12975 మైసూర్- టు జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27, 29, జూలై 4, 6 తేదీల్లో రద్దు చేశామని, 12539 యశ్వంత్‌పూర్- టు లక్నో ఈ నెల 26వ తేదీ, జూలై 3వ తేదీన రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 12540 లక్నో- టు యశ్వంత్‌పూర్ ఈ నెల 28, జూలై 5 తేదీల్లో రద్దు చేసినట్టు, 12577 భాగమతి- టు మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28వ తేదీన, వచ్చే నెల 5వ తేదీన రద్దు చేసినట్టు, 22619 బిలాస్‌పూర్ టు -త్రివేండ్రం తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25, జూలై 2వ తేదీన రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. 22620 త్రివేండ్రం టు -బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేశామని, 22352 పాటలీపుత్ర టు -శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జూలై 5వ తేదీల్లో రద్దు చేసినట్టు, 22352 శ్రీమాత వైష్ణో-పాటలీపుత్ర ఈ నెల 24, జూలై 1, 8 తేదీల్లో రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular