Saturday, May 10, 2025

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. దేశాభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిది.. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు.. తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘‘తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణం . గొప్ప చరిత్ర,విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం..’’ అని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com