- రాష్ట్ర జనాభాలో 90 శాతం మంది ఓబీసీలు.. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు
- మోదీ మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్
- నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
- రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో రాహుల్ గాంధీ
తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణన లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మా నంపై చర్చలో భాగంగా రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభు త్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో 90 శాతం జనాభా ఉన్న ఓబీసీలు, దళితులు, ఆది వాసీలు, మైనారిటీలకు హక్కులు దక్కడం లేదని పేర్కొ న్నారు. తెలంగాణలో కులగణన పూర్తి చేశాం. ఈ కులగణనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ జనా భాలో 90 శాతం మంది ఓబీసీలు.. దళితులు, ఆది వాసీలు, మైనారిటీలు ఉన్నా రంటూ రాహుల్ గాంధీ వివరించారు. బీజేపీలో కూడా 50 శాతం మంది ఎంపీలు ఓబీసీ వర్గానికి చెందిన వాళ్లేనని, కానీ వాళ్లకు మాట్లాడే అధికారం లేదంటూ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు.
దీని కోసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలు లేవని.. నిరుద్యోగ సమస్యను నుంచి దేశం బయట పడలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఎలాంటి మార్పు జరగలేదని వివరించారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం మంచిదే అయినప్పటికీ.. దాని లక్ష్యం నెరవేరడం లేదన్నారు. నిరుద్యోగ సమస్యను అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పాటు ఇప్పటి ఎన్డీఏ సర్కార్ కూడా పరిష్కరించ లేదన్నారు. ఉత్పత్తి రంగంలో చైనా మనకంటే పదేళ్లు ముందుందని, భారత్ పూర్తిగా వెనకబడి పోయిందంటూ పేర్కొన్నారు. తయారీరంగంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గోల్‌మాల్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్‌గాంధీ. వోటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్నారు. ఎన్నికలకు ముందు ఐదు నెలల్లో 70 లక్షల వోటర్లను చేర్చారని, దీనిపై ఈసీ సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఐదు నెలల్లో కొత్తగా 70 లక్షల వోటర్లు చేర్చారని.. షిర్డీలో ఒకే భవనంలో 7000 వోటర్లను చూపించారంటూ రాహుల్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్లు పెరిగారని.. ఈసీ వోటర్ల డేటాను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీకి, అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ స్వీకారోత్సవానికి ఆహ్వానంపై ఆయన ఆరోపణలు చేశారు.
దీంతో సభలో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. రాహుల్ వ్యాఖ్యల్ని అధికార పక్షం తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని బిజెపి ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ విదేశాంగ విధానానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయవద్దని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం పొందడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని అమెరికాకు పంపాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ, ఆర్థిక విధానాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటే ఈ పరిస్థితి వొచ్చేది కాదని అన్నారు. ‘మేము అమెరికాతో మాట్లాడినప్పుడు, మా ప్రధానమంత్రి ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రిని మూడు-నాలుగు సార్లు పంపము ఎందుకంటే మాకు ప్రొడక్షన్ సిస్టమ్ ఉండి, మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాలపై పని చేస్తుంటే, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వొచ్చి ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు‘ అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడిన కిరణ్ రిజిజు
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నాయకుడు అంత తీవ్రమైన, ఆధారాలు లేని ప్రకటనలు చేయొద్దు.. ఇది రెండు దేశాల సంబంధాలకు సంబంధించిన విషయం. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే, విదేశాంగ మంత్రి ఏ ప్రయోజనాల కోసం అమెరికా వెళ్లారో చెప్పాలని సవాల్ చేశారు. రాహుల్ గాంధీ చైనా అంశాన్ని లేవనెత్తుతూ.. లడఖ్‌లో చైనా సైన్యం చొరబాటు గురించి ప్రధాని చేసిన వాదనలకి విరుద్ధంగా భారత సైన్యం వాదలు ఉన్నాయనడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాట్లాడే మాటలకు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.