హైకోర్టులో మోహన్‌బాబు లంచ్‌మోషన్ పిటిషన్
కుటుంబ వివాదాల నేపథ్యంలో మోహన్‌బాబుకు ఇచ్చిన నోటీసులపై కోర్టుకెక్కారు. హైకోర్టులో మోహన్‌బాబు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాచకొండ పోలీసుల నోటిసులపై స్టే ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా తన గన్ తన దగ్గరే ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
మోహన్‌బాబు పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణను ఈ 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపునిచ్చింది. గన్ ను కూడా ఇప్పుడే స్వాధీనం చేసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం సూచించింది.