Saturday, March 29, 2025

మోహన్‌లాల్‌ వల్లే ఇలాంటి ప్రచారం

ఎన్టీఆర్‌ సీక్వెల్‌ చేయబోతున్న సినిమా ఏదైనా ఉందంటే అది దేవర2. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు జనతాగ్యారేజ్‌2 సీక్వెల్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా కొరటాల శివనే దర్శకత్వం వహించడం విశేషం. అయితే జనతా గ్యారేజీ సినిమా సీక్వెల్‌ తీద్దామని ఎప్పుడూ అనుకోలేదు. తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ సినిమా సీక్వెల్‌ కావాలని కోరుకుంటున్నారు. అయితే అది ఓపెన్‌ ఎండ్‌ మూవీ. ఇప్పుడీ చర్చ మరోసారి మొదలవ్వడానికి కారణం మోహన్‌లాల్‌.
జనతాగ్యారేజ్‌ చిత్రం మోహన్‌లాల్‌కి టాలీవుడ్‌లో మరోమైలు రాయి చిత్రం అయింది. ఈ చిత్రం తరువాతే మోహన్‌లాల్‌లో టాలీవుడ్‌లో మరింత క్రేజ్‌ పెరిగింది. అలాంటి సినిమా తీస్తే సీక్వెల్‌ చేయడానికి రెఢీ అన్నట్లు ఆయన ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సీక్వెల్స్‌పై మాత్రం ఎన్టీఆర్‌ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్‌ రావడం లేదు. మరి ఎప్పుడు రియాక్ట్‌ అవుతాడో చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com