Wednesday, January 8, 2025

మ‌హ్మ‌ద్ సిరాజా మ‌జాకా..

మొద‌టి టెస్టు అప‌జ‌యానికి ద‌క్షిణాఫ్రికా మీద భార‌త జ‌ట్టు భ‌లే బ‌ద్లా తీసుకుంది. హైద‌రాబాద్ బౌల‌ర్ సిరాజ్ ధాటికి సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు విల‌విల‌లాడిపోయారు. బుధవారం ఆరంభ‌మైన రెండో క్రికెట్ మ్యాచులో హైద‌రాబాద్ ఫేస్ బౌల‌ర్ సిరాజ్ ధాటికి ద‌క్షిణాఫ్రికా కుప్ప‌కూలింది. మ‌న హైద‌రాబాద్‌కి షాన్ అయిన మ‌హ్మ‌ద్ సిరాజ్ 9 ఓవ‌ర్లు వేసి 15 ప‌రుగులిచ్చి ఆరు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. కేవ‌లం 55 ప‌రుగుల‌కే సౌతాఫ్రికా కుప్ప‌కూలింది. ఆ జ‌ట్టుకు హైద‌రాబాద్ మీద ఇదే అత్య‌ల్ప స్కోరు. భార‌త చేతిలో ఏ జ‌ట్టు కూడా ఇంత ఘోరంగా ఆలౌట్ అవ్వ‌లేదు. మిగ‌తా దేశాల విష‌యానికి వ‌స్తే.. 2021లో న్యూజిలాండ్ జ‌ట్టు ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో 62 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. 2015లో ద‌క్షిణాఫ్రికా నాగ్‌పూర్‌లో 79 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌గా.. 2021లో అహ్మ‌దాబాద్‌లో ఇంగండ్ జ‌ట్టు 81 ప‌రుగులు, 1990లో చండిఘ‌డ్‌లో శ్రీలంక జ‌ట్టు 82 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com