Saturday, December 28, 2024

మోకిలా పీఎస్‌కి రాజ్ పాకాల

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో కీల‌క నిందితుడు

జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీసుల ముందుకొచ్చాడు. దీంతో ఆయన్ని పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు.
శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్లు సమాచారం. అర్థరాత్రి దాటిన తర్వాత పెద్ద శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగేసి సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో 20 మందికి పైగా పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే దాదాపు 40 మందితో ఈ పార్టీ నిర్వహించినట్టు అంతర్గత సమాచారం. పురుషులకు టెస్ట్ చేయగా రాజ్ పాకాల ఫ్రెండ్ విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారం తర్వాత రాజ్ పాకాల అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారాయన. ఈ క్రమంలో బుధవారం పోలీసుల ముందుకొచ్చాడు రాజ్ పాకాల. పోలీసుల విచారణలో పార్టీ, డ్రగ్స్ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com