Friday, December 27, 2024

మోక్షజ్ఞ ఎంట్రీకి మోక్షం ఎప్పుడో?

మోక్షజ్ఞ తొలి చిత్రం షూటింగ్‌పై స్పందించిన నందమూరి బాలకృష్ణ
అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడిందన్న బాలకృష్ణ
ప్రజల ఆశీస్సులు, అభిమానుల సపోర్టు మోక్షజ్ఞకు ఉంటాయన్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కధానాయకుడిగా ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీతో సెన్సేషన్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ మొదటి మూవీ రాబోతోంది. ఇక నందమూరి ఫ్యాన్స్‌ అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య ఇన్నిరోజులకి మా బాలయ్యబాబు వారసుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెగ సంబరపడిపోయారు. అయితే ఇంతలోనే మళ్ళీ బాంబు పేలింది అన్నట్లు ఈ మూవీ ప్రారంభోత్సవంలోనే ఆగిపోయింది. మోక్షజ్ఞ కొత్త చిత్రం పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేసినప్పటికీ అనివార్య కారణాలతో కార్యక్రమం రద్దు అయింది.

దీనిపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. కాకినాడలో ప్రముఖ ఆభరణాల నూతన షోరూం ప్రారంభోత్సవంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మోక్షజ్ఞ మూవీపై మీడియా ప్రశ్నించగా, ఆయన సమాధానమిచ్చారు. మోక్షజ్ఞ సినిమా మొదలు పెట్టాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. అంతా మనమంచికే అని అనుకోవడం తప్పితే వేరే ఏమి లేదన్నారు.

మోక్షజ్ఞ అనారోగ్యానికి గురికావడమే అని చిత్ర పీఆర్వోలు తెలుపుతున్నారు.మోక్షజ్ఞ జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని మరొక రోజుకు వాయిదా వేసినట్లుగా వారు ప్రకటించారు. వాస్తవానికి ఈ వేడుకకు ఏపీ మినిస్టర్, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడనేలా ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో మోక్షజ్ఞ లేకుండా అయినా మూవీని ప్రారంభించవచ్చు. కానీ అలా చేయకుండా వాయిదా వేయడంపై నెటిజన్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక మోక్షజ్ఞ చిత్ర అప్‌డేట్‌ ఇచ్చిన కొద్ది నిమిషాలకే మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీని ప్రకటించారు. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్‌మెంట్ రాగానే.. ఒక్కసారిగా సోషల్ మీడియా షేకయింది. తన కొడుకు అరంగేట్రం వేళ.. సదరు నిర్మాత ఇలాంటి అనౌన్స్‌మెంట్ చేయడంపై బాలయ్య ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా? అందుకే ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయించారా? అనేలా కొందరు నెటిజన్లు ఊహాగానాలు చేస్తుండటం గమనార్హం.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com