నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో నేడు, రేపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంకో రెండు నాలుగైదు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నతర్వాత జూన్ మెుదటి వారంలోనే రాష్ట్రానికి రానున్నాయి. జున్ మెుదటి వారంలో దక్షిణ తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఇక జూన్ రెండో వారంలో తెలంగాణ అంతటా సాధారణ వర్షాలు కురుస్తాయన్నారు. జూన్ మూడో వారంలో మంచి వర్షాలు కురుస్తాయని.. జూన్ చివరి వారం నాటికి రాష్ట్రం అంతటా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.