మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను Jకొంతమంది కావాలనే వక్రీకరించారించారనిటీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానం అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని అన్నారు. వివిధ సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణలో కొంతమేర జాప్యం జరుగుతోందని చెప్పారు. తమ ప్రభుత్వంలో మంత్రులు అందరూ కలిసే ఉన్నారని కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని చెప్పారు. ఈనెల 26, 27 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమేనని విమర్శించారు. బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వ సాధారణం, మహిళలకు కాంగ్రెస్‌లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలో లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.