మూన్ స్టార్షూ- ధర ఏకంగా 164 కోట్లు
వామ్మో..హెలికాప్టర్ లో షూ డెలివరీ
మామూలుగా షూ ఖరీదు ఎంత ఉంటుంది.. రెండు వేలు, మూడు వేలు.. మహా ఐతే పది వేలు. ఇదీ కాకపోతే సినీ,రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు వేసే ఇంటర్నేషనల్ బ్రాండ్ షూ ఐతే రెండు మూడు లక్షల రూపాయల ఖరీదు ఉంటుంది. అంతే కానీ షూ ఖరీదు కోట్లల్లో ఉంటుందని మనం ఊహిస్తామా చెప్పండి. ఇలా ఎవ్వరూ ఊహించనట్టే షూ ధర కోట్ల రూపాయల్లో ఉంటుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.సదరు షూ ఖరీదు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే మరి.
ప్రఖ్యాత ఇటాలియన్ షూ డిజైనర్ ఆంటోనియో వయోత్రి ఈ ఖరీదైన మూన్ స్టార్ షూను డిజైన్ చేశారు. ఈ మూన్ స్టార్షూస్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూగా రికార్డుల్లోకెక్కింది. ఈ మూన్ స్టార్ షూను బంగారంతో తయారు చేసి, దానిపై అత్యంత ఖరీదైన వజ్రాలు పొదిగారు. అంతే కాకుండా ఈ షూ తయారీలో ఉల్క పదార్థాన్ని కూడా ఆంటోనియో వయోత్రి ఉపయోగించారట.
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా తరహాలో ఈ షూను ప్రత్యేక డిజైన్ తో రూపొందించారు. ఈషూలో మొత్తం 30 క్యారెట్ల వజ్రాలను పొదిగారు. ఇక షూ మడమ భాగం మొత్తం మేలిమి బంగారంతో చేయబడింది. దాని వాంప్ ఖరీదైన వజ్రాలతో కప్పబడి ఉంటుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ మూన్ స్టార్ షూను 2019 లో దుబాయ్‌లోనిర్వహించిన మేడ్ ఇన్ ఇటలీ డిజైన్డ్ ఇన్ ఎమిరేట్స్ – ఎంఐడీఈ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు.
ఇక ఈ ప్రత్యేకమైన షూ ఏకంగా 164 కోట్ల రూపాయల ధర పలికింది. ఈ షూ ధర చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈఅత్యంత విలువైన మూన్ స్టార్ షూని హెలికాప్టర్ ద్వార డెలివరీ చేశారు. ఒక జత బూట్లకుఏకంగా రూ.164 కోట్లు పలకడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఇవే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ కావడం గమనార్హం. అంతే కాదు ఈ షూ ను హెలికాప్టర్ద్వారా డెలివరీ చేయడం మరో విశేషం.