అసలు విషయం ఏంటంటే.. జాన్వీ కపూర్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేసింది. The most expensive Lexus LM 350 car అత్యంత ఖరీదైన లెక్సస్ ఎల్ఎమ్ 350 కారును కొనుక్కుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 2.50 కోట్లు. కారు రిజిస్ట్రేషన్, ఎక్స్ట్రా ఫిట్టింగ్‌లతో కలిపి సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లెక్సస్ ఎల్ఎమ్ 350 కారును కొనుగోలు చేసింది జాన్వీ కపూర్. ఇక ఈ కారును నాలుగు చక్రాలపై లగ్జరీ అని పిలుస్తారు. ఈకేవలం నాలుగు సీట్ల కారులో అత్యంత విలాసవంతమైన ఫీచర్స్ ఉన్నాయి.
డ్రైవర్ సీటుతో సహా ఈ కారులోని సీట్లు ఏడు వేర్వేరు మసాజ్ ఆప్షన్స్ కలిగి ఉంటాయి. వేడిచేసిన, వెంటిలేటెడ్ వ్యవస్థలను కూడా కలిగి ఉంటుంది. వెనుక సీటు కోసం ప్రత్యేక టీవీ సిస్టమ్, లెగ్ లెంగ్త్ స్లీపింగ్ సిస్టమ్ ఉంటుంది. కారులో ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ తో పాటు చాలా సౌకర్యాలను కలిగి ఉంది ఈ లెక్సస్ ఎల్ఎమ్ 350 కారు. జపాన్ కు చెందిన ప్రముఖ కార్ డిజైనర్ ఈ కారును డిజైన్ చేయగా.. ఈ కారు పేరు లగ్జరీ ఆన్ మోషన్. జాన్వీ కపూర్ కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారు బాలీవుడ్‌లో స్టార్ నటుడు రణబీర్ కపూర్‌తో పాటు మరెవరికీ లేదని చెబుతున్నారు.