- సియోల్ స్టడీ టూర్ కు ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం
- ఈ నెల 21నుంచి 24 వ తేదీ వరకూ సియోల్‌లో పర్యటన
- మూసి పునరుజ్జీవనం దిశగా మరో కీలక ముందడుగు
మురికికూపంగా మారిన మూసీని ప్రక్షాళనతో నదికి పూర్వ వైభవం తేవడం, హైదరాబాద్ ను గొప్ప హెరిటేజ్ నగరంగా తీర్చిదిద్దడం , స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉపాధి కల్పన, ఆదాయ మార్గాలు అభివృద్ధి చేయడం కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది.
మూసీ పునరుజ్జీవనం కోసం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులతో కూడిన బృందం ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వరకూ దక్షిణ కొరియాలోని సియోల్ నగరాన్ని సందర్శించనుంది. సియోల్ లో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి బృంద సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఇందుకోసం బృంద సభ్యులు ఈ నెల 20 వ తేదీ వేకువ జామున హైదరాబాద్ నుండి దక్షిణ కొరియాకు బయలు దేరనున్నారు. తిరిగి ఈ నెల 25 వ తేదీన హైదరాబాద్‌కు చేరుకుంటారు