- ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు చేపడతామని ప్రభుత్వం హామీ
- త్వరలోనే కల నెరవేరాలని ప్రజల ఆకాంక్ష
వరంగల్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కదలిక వచ్చింది.ఈ కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సిఎం రేవంత్ ఇటీవల ప్రకటించటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు త్వరలోనే ఆ కల నెరవేరాలని కోరుతున్నారు. కొన్నేళ్లుగా ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే అవేవీ కొలిక్కి రాలేదు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఎయిర్‌పోర్టు అథారిటీ (ఏఏఐ) అధికారుల్లో కదలిక వచ్చింది.
విమానాశ్రయం నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న 706 ఎకరాలకు అదనంగా మరో 253 ఎకరాలు కేటాయిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సైతం అనుమతులు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. భూమి కేటాయింపు ఉత్తర్వుల నేపథ్యంలో ఏఏఐ అధికారులు వరంగల్ ఎయిర్‌పోర్టు పరిస్థితులపై గతంలోనే పరిశీలన చేశారు.