- సంధ్య థియేటర్ ఘటన అందరికీ గుణపాఠం కావాలి
- ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలవాలని, శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా ఆయనే భరించాలని ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. కిమ్స్ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను వారు చూసి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ కు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని, వారు ఎక్కడికి వెళ్లినా పెద్దఎత్తున జనం వొస్తారని తెలిపారు. కాబట్టి వారి పర్యటన ఉన్నప్పుడు ముందస్తు ఏర్పాట్లు అవసరమన్నారు.
సినిమా విడుదలైనపుడు వేలాది మంది వొ స్తారని, థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామటున్నారు.. పోలీసులు మేము అనుమతి ఇవ్వలేదటున్నారు. ఏదీ ఏమైనా, ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరం.. వారి బాబు ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాడని త్వరగా కోలుకోవాలని రాకేష్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సంఘటన అందరికీ గుణపాఠం కావాలి. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ దీనిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ పెద్దలు, మరీ ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నట్టు ఉంది. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో, ఏం అహంకారం ఉందో తెలియదు కానీ.. కావాలని ఇలాంటి సంఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలి తప్ప..
కావాలని వారిని పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టుడు మంచిది కాదని హితువు పలికారు. ప్రధానమంత్రి తమ నియోజకవర్గానికి వొచ్చారు.. రోడ్ షో చూడటానికి ఒక పాత బిల్డింగ్ మీద చాలా మంది ఎక్కారు.. ఇల్లు కూలి ఏమన్నా అవుతుందా అని భయపడ్డాం. ఏమన్నా అయితే ప్రధాన మంత్రిని బాధ్యుల్ని చేస్తారా ? కుంభమేలాలో కూడా తొక్కిలాటలు జరుగుతాయి. ప్రభుత్వాలకు రెండు విశేష అధికారాలు ఉంటాయి ఎవరినైనా ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు, ఎవరి మీద నైనా పన్నులు వేయవచ్చు. అంతమాత్రనా ఏది పడితే అది చేస్తామంటే ప్రజలు సహించరని అన్నారు. తాను ఇక్కడికి వొవచ్చింది శ్రీతేజ త్వరగా కోలుకోవాలని,వారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికేనని అన్నారు. దీనిని రాజకీయపరంగా కాకుండా, చిల్లర వేషాలు వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కోరారు.