Monday, October 7, 2024

మూసీ ప్రక్షాళన ఎవరి కోసం..?

  • బ్యూటిఫికేషన్​ పేరుతో బడా బాబులకే మూసీ ప్రక్షాళనను మేం అడ్డుకోం
  • ముందు అఖిలపక్షం ఏర్పాటు చేయండి సీఎం రేవంత్‌కి ఎంపీ ఈటల ఘాటు లేఖ

బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏమిటీ? డీపీఆర్ ఉందా? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమో గంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ ఆదివారం బహిరంగంగా లేఖాస్త్రం సంధించారు.

తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా సంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

చెరువు కన్నతల్లి లాంటిదని ఆయన అభివర్ణించారు. కానీ హైదరాబాద్‌లో ఉన్న ఏ చెరువు కూడా పక్షులకు, చేపలకు నిలయంలాగా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కన్నతల్లి లాంటి ప్రేమను పంచి పాలలాంటి నీళ్లను ఇచ్చి జీవం పోసిన చెరువు ప్రస్తుతం భూగర్భంలో విషాన్ని నింపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దుర్వాసననిస్తుందని చెప్పారు. ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రజల రోగాలకు నిలయంగా మారిందన్నారు. ముందు ఈ చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. అలా చేయకుండా.. 4 దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో, ప్రభుత్వం అనుమతించిన లే అవుట్‌లలో ఇల్లు నిర్మించుకున్న నిరుపేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ మీరు చేస్తున్న అడ్డగోలు కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎంపీ ఈటల కుండ బద్దలు కొట్టారు.

వారు గొల్లున ఏడుస్తునా, కాళ్ళమీద పడ్డా వదిలిపెట్టడం లేదన్నారు. వారు కడుపు కాలి మాట్లాడుతున్నారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. డబ్బులు ఇస్తే కాదు.. పేదల చిరకాల స్వప్నం ఇళ్లు.. దొంగలలాగా దాడి చేసి మీరు చేస్తున్న కూల్చివేతలు.. ఇస్తున్న నోటీసులు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలంటూ సీఎం రేవంత్‌కు ఈ సందర్బంగా ఈటల రాజేందర్ సూచించారు. ముఖ్యమంత్రిగా మీకేమీ అపరిమిత అధికారాలు లేవని గుర్తు చేశారు. పేదలను ఇబ్బంది పెట్టడానికి కాదు మీకు అధికారం ఇచ్చిందన్నారు. పేదల పక్షాన కొట్లడడం తన కర్తవ్యమని స్పష్టం చేశారు.

మూసీ ప్రక్షాళనను అడ్డుకోం
పదేళ్ళున్న కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని గుర్తు చేశారు. మీరు మూసీ ప్రక్షాళన చేస్తానంటే అడ్డుకోమమన్నారు. పట్టా భూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా కట్టుకొని ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. పిడికెడు అక్రమ ఇళ్లను బూచిగా చూపి కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొడుతున్నారు. నివాసాలపై RB-X అని రాస్తున్నారన్నారు. ఫణిగిరి కాలనీ, మారుతినగర్, చైతన్య పురి, ప్రజయ్ ఇంజనీరింగ్ సిండికేట్ లాంటి అపార్ట్‌మ్మెంట్స్ అన్నీ పరిశీలించినట్లు వివరించారు. తాము ప్రజల మధ్య ఉన్నామన్నారు. మీకు తిరిగి చూసే టైం లేదన్నారు. తిరిగి చూసి.. వారి ఆక్రందనాలను ఆవిష్కరించే మమ్ముల్ని కాలకేయులుగా పోలుస్తున్నారని… ఇదేనా మీ భాష మీ సంస్కారం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల మండిపడ్డారు.

పేదలను కొట్టి పెద్దలకు వేస్తారా..?
బ్యూటిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏమిటీ? డీపీఆర్ ఉందా? ఇళ్ళు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి ? కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమో గంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఇంతకీ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ నిర్ధారించకుండ కూల్చివేతలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టా భూముల్లో ఇళ్ళు కట్టుకున్న వారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తున్న పనులు హైదరాబాద్ భవిష్యత్తుని, అభివృద్ధిని ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయన్నారు.

అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. మేం వస్తాం
స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా.. నిర్ణయాధికారం ఉన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తన కొట్లాట.. రూపాయి రూపాయి కూడబెట్టి నిర్మించుకున్న పేదల ఇళ్ళ కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. మీరు లక్షన్నర కోట్లు పెట్టే ఖర్చు పేదల కోసమేనా ? అంత బడ్జెట్ మతలబు ఎంటో తేలాల్సిఉందన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా తాను ప్రజల పక్షాన ఉండే వాడినని ఈ తెలంగాణ సమాజానికి తెలుసునని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular