Saturday, December 28, 2024

2047 క‌ల్లా ప్ర‌పంచంలోనే భార‌త‌దేశాన్ని శ‌క్తివంత‌మైన ఆర్థిక దేశంగా ప్ర‌ధాని మోదీ తీర్చిదిద్దారు : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

రోజ్ గార్ మేళా కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రు
ఉద్యోగ‌ల‌కు నియామ‌క ప‌త్రాలు అంద‌జేత

విజ‌య‌వాడ : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల‌తో పాటు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో మ‌న దేశం మ‌రింత ధృడంగా ప్ర‌ధాన మంత్రి మోదీ నాయ‌క‌త్వంలో కానుంది. విక‌సిత్ భార‌త్ అనే నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్ర‌పంచంలో అగ్ర‌గామి ఆర్థిక శ‌క్తి చేయాల‌నే త‌లంపు ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఎన్నో కార్య‌క్ర‌మాలు యువ‌త కోసం ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌పంచంలో భార‌త‌దేశాన్ని 2047 క‌ల్లా ఒక శ‌క్తివంతమైన ఆర్థిక దేశం ప్ర‌ధాన మంత్రి మోదీ తీర్చిదిద్దుతార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

విజయవాడ రైల్వే ఆడిటోరియం లో పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం నిర్వహించిన (పి.ఎం.ఆర్.వై) ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా ట్రాంచ్ -1 (ఫేస్ -ll) కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు తో ఎంపీ కేశినేని శివనాథ్ క‌లిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు సాధించిన మొత్తం 185 మందికి నియామక పత్రాలు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఇవ్వటం జరిగింది. విజ‌య‌వాడ ప‌రిధిలో 151 మంది పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే స్ నుండి 10 మంది,స్కూల్ అఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ 15 మంది , ఎఫ్‌.సి.ఐ నుండి 6 గురు, ఐ.వో.బి నుండి 3 గురికి నియకపత్రాలు అందించ‌టం జరిగింది. నియామ‌క ప‌త్రాలు అందుకున్న ఉద్యోగస్తుల‌కి ఎంపి కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలో దేశం నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి భారత్ దేశం ఎదిగింది.. శక్తివంతమైన భారత దేశ నిర్మాణం కోసం రోజ్ గార్ మేళాలో అపాయింట్ మెంట్ లెటర్స్ పొందినవాళ్లు పనిచేయాలని పిలుపునిచ్చారు . ప్రధాని నరేంద్ర మోడీ యువ భారత్ చెయ్యటం లో ఎమ్.ఎస్.ఎమ్.ఈ , రోజ్ గార్ మేళా, సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ ఆఫ్ ఇండియా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నార‌న్నారు. ఇక వ‌డోద‌రా టాటా వారి ఆధ్వ‌ర్యంలో ఎయిర్ క్రాఫ్ట్ యూనిట్ ను ప్రారంభించ‌టం జ‌రిందని తెలిపారు. త‌ప్ప‌కుండా 2047 లో ప్రపంచ దేశలలో మన దేశం ఆర్థిక దేశం గా ప్రధాన మంత్రి మోడీ నాయకత్వం లో అవుతుందన్నారు..

దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళా ద్వారా 51 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అంద‌జేయ‌టం జ‌రిగింద‌ని తెలిపారు. రోజ్ గార్ మేళాలో నియ‌మాక పత్రాలు అందుకుంటున్న ఉద్యోగులు చాలా అదృష్ట వంతులు..వీరికి సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ ఇండియా ద్వారా శిక్ష‌ణ పొందుతార‌ని తెలిపారు. క‌ర్మ‌యోగి ప్రారంభ కింద 1400 కోర్సులు శిక్ష‌ణ తీసుకుంటారన్నారు. .గ‌తంలో ఉద్యోగంలో చేరే వారికి ఇలాంటి శిక్ష‌ణ వుండేది కాదు. శిక్ష‌ణ లో మీరు సాంకేతికంగా కూడా నైపుణ్యం సాధించి దేశాభివృద్దికి మీ వంతు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లు క‌ట్టే ట్యాక్స్ తోనే మ‌నం జీతాలు తీసుకుంటున్నాం మ‌న జీవితాలు వాళ్లు క‌ట్టే ట్యాక్స్ మీదే ఆధాపడి వున్నాయి..అంద‌రూ ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మై వుండాలి.

అనంత‌రం ఎమ్మెల్యే బొండా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి మోదీ నాయ‌క‌త్వంలో దేశంలో ప‌లు రంగాలు దృఢంగా అవుతున్నాయ‌న్నారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ, రోజ్ గార్ మేళా కార్య‌క్ర‌మాల‌తో యువ‌త‌కు విరివిగా ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నార‌ని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒకే రోజు 51 వేల మందికి ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వటం ఎప్పుడు చూడలేదని..ఇదొక రికార్డ్ అని చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. నియామక పత్రాలు అందుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో విజయవాడ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ దేవి రెడ్డి శ్రీధర్ మూర్తి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కే.ప్రకాష్, రైల్వే డి.ఆర్.ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ , బి.ఎస్.ఎన్.ఎల్ మేనేజర్ ఎం. శేషాచలం పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com