Saturday, April 19, 2025

నారా రామ్మూర్తి నాయుడు సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

రామ్మూర్తి మృతికి ఎంపి కేశినేని శివనాథ్ సంతాపం

విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి ప‌ట్ల ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తీవ్ర దిగ్భాంత్రి వ్య‌క్తం చేశారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యే గా రామ్మూర్తి నాయుడు ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌లు ఎన‌లేనివి. పార్టీకి అందించిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి, చిరస్మరణీయం. ఆయ‌న మ‌ర‌ణం నారా కుటుంబానికి తీర‌ని లోటు అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శ‌నివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

నారా రామ్మూర్తి నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భ‌గ‌వంతుడ్ని కోరుకుంటూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేయటంతోపాటు ఆయ‌న‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే సోద‌ర వియోగంతో చింతిస్తున్న సీఎం చంద్ర‌బాబు నాయుడుకి త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com