Sunday, March 16, 2025

సీఎం చంద్ర‌బాబు తో ఎంపి కేశినేని శివ‌నాథ్ భేటీ

  • ప‌లు స‌మ‌స్య‌ల‌పై విన‌త పత్రాలు అంద‌జేత‌
  • సీఎం దృష్టికి ఓల్డ్ రాజరాజేశ్వరిపేట నివాసితుల స‌మ‌స్య‌
  • లాజిస్టిక్ పార్క్ కి అవ‌స‌ర‌మైన స్థలం అంశం ప్ర‌స్తావ‌న‌

విజ‌య‌వాడ : టిడిపి కేంద్రం కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం క‌లిశారు. విజ‌య‌వాడ‌లోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు అంద‌జేసి ఆ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓల్డ్ రాజ‌రాజేశ్వ‌రి పేట ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన స్థలంలో నివాసం వుంటున్న నివాసితులు ప‌దిహేను రోజుల్లోగా ఖాళీ చేయాల‌ని రైల్వే అధికారులు చాటింపు వేయించార‌ని…త‌మ ఇళ్లు కూల్చి వేసి ఖాళీ చేయిస్తార‌ని బాధితులు అందోళ‌న ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌క్ష‌ణం కూల్చివేత చర్యలు నిలిపివేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌టం తోపాటు…ఆ త‌ర్వాత ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కార దిశ‌గా కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కొండపల్లి రైల్వే స్టేషన్ స‌మీపంలో లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి కోసం ఆసక్తి చూపిన ఆ స్థలాన్ని ఎన్‌హెచ్ఏఐకి అందజేయడానికి ఏపీసీఆర్‌డీఏకు అవసరమైన భూమిని అప్పగించవలసిందిగా ఏపీజెన్‌కోను ఆదేశించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండు అంశాల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com