Thursday, April 17, 2025

రవాణా కమిషనర్ సిన్హాను కలిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

రవాణా సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి

విజయవాడ :: రాష్ట్రంలోని ర‌వాణా రంగంలో నెలకొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని కోరుతూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో బుధవారం క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా కు ర‌వాణా రంగంలోని స‌మస్య‌లు ప‌రిష్క‌రించి లారీ ఓన‌ర్స్ ను ఆదుకోవాల్సిందిగా కోరారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి కూడా రవాణా సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన‌ట్లు తెలిపారు.

ఎం.పి కేశినేని శివనాథ్ అభ్యర్థన పై ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా సానుకూలంగా స్పందించారు. తమ పరిధిలోని వాటిని తాము పరిష్కరిస్తామని, ఆర్థికపరమైన అంశాలను ఆర్థికశాఖకు పంపిస్తామని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి. ఈశ్వరరావు, ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుమోతు రాజా, ప్రధానకార్యదర్శి అల్లాడ వీరవెంకట సత్యనారాయణ, కృష్ణా డిస్ట్రిక్ట్ ట్రైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సూరపనేని సురేష్, కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ ఫౌండేషన్ కోశాధికారి అనుమకొండ హరివెంకట సురేష్ , సహాయకార్యదర్శి వత్సవాయి కృష్ణంరాజు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com