Wednesday, October 2, 2024

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బిఆర్‌ఎస్‌ది అనవసరపు రాద్దాంతం – కాంగ్రెస్ ఎంపి మల్లు రవి

నగరంలోని చెరువులు, నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బిఆర్‌ఎస్ అనవసరపు రాద్దాంతం చేస్తుందని మంగళవారం కాంగ్రెస్ ఎంపి మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే మూసీనదిపై ఉన్న ఆక్రమాణలను, నగరంలోని చెరువులు, కుంటలపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్ తమ ఎజెండాగా చెప్పుకొని, ఇప్పుడు మాట మార్చారని ఆయన ఆరోపించారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో చేయనిది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే కెటిఆర్, ఆ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్ గతంలో ఆక్రమణల గురించి ప్రకటించింది అబద్దమని ఒప్పుకున్నట్లేనా అని ఆయన ప్రశ్నించారు. చిన్నపాటి వర్షానికి నగరంలోని రోడ్లు, కాలనీలు జలమయం అవుతున్నాయని, నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఆ నీరంతా సులభంగా నాలాల్లోకి వెళుతుందన్నారు.

మూసీ సుందరీకరణ చేస్తానని అప్పట్లో కెసిఆర్ ప్రకటించి, ఆ ప్రకటనను మూసీలో కలిపారని మల్లు రవి ఎద్దేవా చేశారు. 2016లోనే నగరంలో ఉన్న ఆక్రమణలను పూర్తిగా నిర్మూలిస్తామని కెసిఆర్ ఘనంగా ప్రకటించారని, కానీ, దానిని నిలబెట్టుకోలేదన్నారు. అప్పుడు కెసిఆర్ చెప్పింది ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారని మల్లు రవి వెల్లడించారు. గులాబీ నేతలు పేదలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తక్షణమే వారి నాటకాలను మానేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిత్తశుద్ది ఉంటే ఆక్రమణల తొలగింపునకు సహాయపడాలని మల్లు రవి సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular