Saturday, April 19, 2025

కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా ఎంపీ  పురందేశ్వరి 

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి  కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా  నామినేట్ చెయ్యడం జరిగింది.
ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా ఉత్తర్వులు  జారీ చేశారు.  2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుంది.   సిపిఎ  ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగానే కాకుండా  మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాజమండ్రి ఎంపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో విడుదల చేశారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, రాజమహేంద్రవరం వారిచే జారీ.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com