టీఎస్ న్యూస్ :బీఆర్ఎస్ కు మరో ఎంపీ రాజీనామా చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజినామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖ ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.కాగా ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఆయనకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.