Friday, May 16, 2025

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ నేతలతో చెన్నై పయనం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ప్రముఖులతో కలిసి తమిళనాడులో బీసీల సంక్షేమం, సముద్ధరణకు అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అధ్యయనానికి గాను చెన్నై బయలుదేరారు
బీఆర్ఎస్ అధ్యక్షులు కే.చంద్రశేఖరరావు మార్గనిర్దేశనం, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సూచన మేరకు గురువారం ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు
చెన్నైలో గురు, శుక్రవారం రెండు రోజులు జరిపే ఈ అధ్యయన యాత్రకు బయలుదేరి వెళ్లిన వారిలో ఎంపీ రవిచంద్రతో పాటు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రులు గంగుల కమలాకర్,జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,కోరుకంటి చందర్,జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితర ప్రముఖులు ఉన్నారు

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com