నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో… కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష ఎంపీ వేమిరెడ్డి పేరును విస్మరించడంతో ఆయన వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు.
దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేదికపై నుంచి వేమిరెడ్డి కారు వరకు వెళ్ళి సముదాయించేందుకు ప్రయత్నించినా స్టేజ్‌పై తనకు తగిన గౌరవం దక్కలేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంపీ వెంట కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా సభ నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి విషయంలో అధికారుల తీరును తప్పు పట్టిన మంత్రి ఆనం, మరోసారి ఇలా జరగకూడదని కలెక్టర్, అధికారులను ఆదేశించారు.