Wednesday, March 26, 2025

పాపం.. ఎంపీల జీతం పెరిగింది

పార్లమెంట్ సభ్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఎంపీల జీత భత్యాలు, పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతం ఉన్న జీత భత్యాలు, పెన్షన్లు పెరగబోతున్నాయి. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల ప్రకారం కేంద్రం ఇవాళ పార్లమెంటు సభ్యుల నెలవారీ జీతం రూ.1 లక్ష నుండి రూ.1.24 లక్షలకు పెంచింది.

పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపుతో పాటు, పార్లమెంట్ సమావేశాలు, అధికారిక విధుల సమయంలో అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి ఉద్దేశించిన ఎంపీల రోజువారీ భత్యం కూడా రోజుకు రూ.2,000 నుండి రూ.2,500కి పెంచారు. వీటికి అదనంగా సిట్టింగ్, మాజీ ఎంపీల నెలవారీ పెన్షన్ రూ.25000 నుండి రూ.31,000కి సవరించారు. ఈ సవరణను లోక్‌సభ సెక్రటేరియట్ ఆమోదించింది.

దీంతో తక్షణమే అమల్లోకి రానుంది. ఎంపీల జీత భత్యాలు, పెన్షన్లు పెంచి చాలా కాలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెన్షన్ పెంపుతో భారీగా ఎంపీలకు ప్రయోజనం చేకూరబోతోంది. వీరిలో చాలామంది జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ పెన్షన్ పెరగకపోవడంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని అధికార, ప్రతిపక్ష ఎంపీలు స్వాగతిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి నిర్ణయాల్లో పారదర్శకత , బహిరంగ పరిశీలన అవసరమని చెప్తున్నారరు. జీవన వ్యయ సమస్యలు, బడ్జెట్ కేటాయింపులు, విస్తృత ఆర్థిక ఆందోళనలపై ప్రభుత్వం కూడా బహిరంగ చర్చలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com