Sunday, May 25, 2025

‘మిస్టర్ బచ్చన్’ సెకెండ్ సింగిల్

ఫస్ట్ సింగిల్‌తో మెలోడియస్ ట్రీట్ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ మేకర్స్ స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్ జూలై 25 న విడుదల కానుంది. ఈ పాట పోస్టర్ రవితేజను కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లైవ్లీ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. రవితేజ మాస్, గ్రేస్‌ఫుల్ మూవ్‌లో కనిపించారు. మిక్కీ జె మేయర్ స్కోర్ చేసిన ఈ పాటలో రవితేజ డ్యాన్స్ ఫ్లోర్‌ ను అదరగొట్టబోతున్నారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ నటిస్తుండగా, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. నామ్ తో సునా హోగా అనేది సినిమా ట్యాగ్‌లైన్. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com